నడుము అందాలను ప్రదర్శిస్తున్న కృతిశెట్టి.. హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా..

వైష్టవ్ తేజ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకంటే కాస్త ఎక్కువగా అందులో హీరోయిన్ కృతి శెట్టి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. సొట్ట బుగ్గ, నాజూకైన అందం, సమ్మోహనపరిచే నవ్వు తెలుగు ప్రేక్షకులకు ఆమెను దగ్గర చేశాయి. 2021లో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. భారీగా వసూళ్లను రాబట్టడంతో పాటు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్‌లను స్టార్లుగా మార్చేసింది. ఇందులో ఆమె పోషించిన బేబమ్మ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. బేబమ్మ అందం, అభినయం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమా హిట్ కావడంతో ఇక వరుస సినిమాల ఆఫర్లు ఆమె ముందు క్యూ కట్టాయి. వాటిలో ఆమె నాని సరసన నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ కొట్టింది. అందులో తన కట్టుబాట్లన్నీ పక్కన పెట్టి నానితో బెడ్ రూమ్ సీన్లలో నటించింది. అంతేకాకుండా నానితో లిప్ లాక్ చేసింది.

ఇవి కాకుండా 2022 సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు సినిమా ఆమె ఖాతాలో మరో హిట్ గా నిలిచింది. ఇక వరుస సినిమా ఆఫర్లు ఆమె వద్దకు రావడంతో స్టోరీ తనకు సెట్ అవుతుందా, లేక అది హిట్ గా నిలుస్తుందా అనే విషయం ఆమె ఆలోచించలేదు. వరుస పెట్టి సినిమాలు చేసేసింది. అదే ఆమె కెరీర్ కు మైనస్ అయింది. చివరికి హిట్ లతో పాటు పరాజయాలు కూడా ఆమెను పలకరించాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమా సైతం పరాజయంగా మిగిలింది. దీంతో సరైన హిట్ కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తన అందచందాలను ప్రదర్శిస్తూ ఆమె హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తోంది. అందులో నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఆమె కవ్విస్తోంది. ఇవి చూసిన నెటిజన్లు బేబమ్మలో ఉండే అందాలు అన్నీ ఇన్నీ కావు అని కామెంట్లు చేస్తున్నారు.