ఇండియన్ హిస్టరీలోనే హీరో ఉపేంద్ర రికార్డును బీట్ చేయలేరా..?

కన్నడ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులలో ఉపేంద్ర ముందు వరుసలో ఉంటారు. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి మెప్పించారు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ బాగానే సంపాదించుకున్నారు. ఉపేంద్ర నటుడు గానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక్కొక్కరికి ఒక రికార్డు సైతం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఏ హీరో కానీ ఏ దర్శకుడు కానీ సాధించలేనటువంటి రికార్డును సైతం సంపాదించారు.

Shivarajkumar Was Not First Choice For Upendra's Om?
హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే దర్శకత్వంలో ఓం అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ,ప్రేమ హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది.. ఉపేంద్ర కాలేజీలో చదువుతున్న సమయంలో చేసినటువంటి కథ ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సైతం అందుకున్నది.

Shivaraj Kumar | Om Box Office | Upendra - Filmibeat
ఈ సినిమా 1995 మే 19న కన్నడ లో విడుదలై పెను సంచలనాలను సృష్టించింది.. అప్పటినుంచి మార్చి 12 2017 వరకు ఈ సినిమా ఏకంగా 550 రీ రిలీజ్ అయ్యి పలు రికార్డులను సృష్టించింది. సాధారణంగా ఏ హీరో అయిన ఒకటి రెండు సార్లు అవుతూ ఉంటాయి కానీ ఏకంగా 550 సార్లు తిరిగి రిలీజ్ కావడం అంటే అది ఒక గొప్ప విషయమే ఈ సినిమా ఎన్నిసార్లు విడుదల కావడంతో ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలోనే ఏ హీరో కూడా చెరపలేనటువంటి రికార్డును సృష్టించారు.