హీరో నిఖిల్ తాజాగా `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు.
జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. పేరుకే స్పై థ్రిల్లర్ మూవీ కానీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసే అంశాలు ఈ సినిమా ఏమీ ఉండవు. టాక్ ఎలా ఉన్నా తొలి రోజు మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు కూడా డిసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాకు రానా తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినిమా క్లైమాక్స్‌లో రానా కేవలం ఒకే ఒక సీన్‌లో కనిపించి సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని డైలాగ్స్ చెబుతాడు. ఆ సీన్ అవసరం లేకపోయినా.. ఏదో ఇరికించేశారు. అయితే ఆ ఒక్క సీన్ చేయడం కోసం రానా ఏకంగా రూ. 40 లక్షలు ఛార్జ్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఎక్కువ మొత్తమే అయినా.. రానా సినిమాలో ఉన్నాడు అని తెలియడానికి స్పైకి మరింత హైప్ ఏర్పడింది. అలాగే బిజినెస్ విషయంలోనూ రానా ఇమేజ్ హెల్ప్ అయింది.