ప్రియదర్శిని రామ్ లవ్ స్టోరీ తెలుసా.. సినిమాకు ఏ మాత్రం తగ్గదు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రియదర్శిని రామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఇవే కాకుండా జర్నలిస్టుగానూ ఆయన చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ దినపత్రికలో లవ్ డాక్టర్ పేరిట ప్రత్యేక కాలమ్ రాసేవారు. ముఖ్యంగా ఇతరులు తమ ప్రేమ సమస్యలను లేఖల ద్వారా ఆయనతో పంచుకుంటే, ఆయన ప్రత్యేక సూచనలిచ్చేవారు.

అందులో నీలాంబరి, అరటిపండు అంటూ కొంచెం వ్యంగ్యంగా, హాస్యంగా, మరికొంత సందేశాత్మకంగా ఎంతో ఆకట్టుకునేవి ఆయన సమాధానాలు. ఇలా తెలుగు వారితో లవ్ డాక్టర్ అని పిలిపించుకునే ఆయన జీవితంలో లవ్ స్టోరీ ఉంది. సినిమా స్టోరీకి ఏ మాత్రం తగ్గని స్టోరీ అది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, అందులోని మలుపులు, అప్పటి విషయాల గురించి తెలియజేశారు.

ప్రియదర్శిని రామ్ లవ్ చేసే సమయానికి ఆయనకు 24 ఏళ్లు. ఆయన ప్రేమించిన అమ్మాయికి అప్పటికి 18 ఏళ్లు. వారిద్దరిదీ ఒకే కాలనీ. ఆమెను ప్రేమలో పడేసేందుకు చాలా కష్టాలు పడి సక్సెస్ అయ్యారు. ఆ ఏరియాలో కొందరు పేకాట ఆడేవారు. అందులో ఆయన ప్రియురాలి తండ్రి కూడా ఉన్నారు. వారితో స్నేహం చేసేందుకు రామ్ పేకాట ఆడడం నేర్చుకున్నారు. చివరికి అలా పేకాట ఆడే పెద్దవారితో స్నేహం చేశారు.

ఒక్కోసారి కావాలనే ఆయన ఓడిపోయి, తాను ప్రేమించే అమ్మాయి తండ్రి గెలిచేలా చేసే వారు. ఇదిలా కొనసాగుతుండగా ఒకరోజు తన మనసులో మాట ఆయనకు చెప్పేశారు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే ఆమె తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఒకరోజు ఇద్దరూ ఇంటి నుంచి లేచిపోయారు. వారికి పెళ్లి చేసింది ఎవరో కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక ఓ రోజు ఇంటికొచ్చి రామ్ చొక్కా పట్టుకుని అమ్మాయి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే రామ్‌ని ఏమీ అనొద్దని ఆయనకు వైఎస్ఆర్ చెప్పారట. ఇలా తన లవ్ స్టోరీ చెప్పి అందరినీ ఆశ్చర్చపరిచారాయన.