ఆ అనుమానమే డైరెక్టర్ క్రిష్ కు భార్యను దూరం చేసిందా..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మొదట గమ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈయన తన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తన కెరియర్ లో వేదం, గౌతమీపుత్ర శాతకర్ణ, కృష్ణం వందే జగద్గురు, తదితర చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా డైరెక్టర్ గా పని చేశారు. డైరెక్టర్ క్రిష్ వ్యక్తిగత విషయం గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు..

Director Krish's Closeness To Heroine Led To Divorce

క్రిష్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగారట. అమెరికాలో ఎమ్మెస్ చేసి 2016లో ఆగస్టు 7న డాక్టర్ రమ్య వెలగను వివాహం చేసుకున్నారు. అయితే టాలీవుడ్ మొత్తం క్రిష్ వివాహానికి హాజరు కావడం జరిగింది.క్రిష్ రమ్యలది పెద్దలు కుదుర్చిన వివాహమట. అయితే అలా వివాహం చేసుకున్న వీరు ఏడాదికే వీరిద్దరు విడిపోవడం జరిగింది.అయితే క్రిష్ కాపురంలో ఒక హీరోయిన్ చిచ్చు పెట్టిందన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

అయితే ఆ హీరోయిన్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సినిమా ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించిందట. దీంతో ఆ హీరోయిన్ కి క్రిష్ బాగా దగ్గరయ్యాడని సమాచారం. అయితే షూటింగ్ పేరుతో ఇంట్లో కంటే ఎక్కువగా బయటనే ఉండడంతో తన భర్త ప్రవర్తన పైన రమ్యకు పలు అనుమానాలు మొదలయ్యాయట .ఒకరోజు క్రిష్ ముంబైలో షూటింగ్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూడగా ఆ సమయంలో సదరు హీరోయిన్ తో ఉండడం చూసిన రమ్య వీరి విడాకులకు దారితీసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2018లో వీరిద్దరికి కోర్టు నుంచి విడాకులు మంజూరు అయ్యాయని తెలుస్తోంది.కానీ ఆ హీరోయిన్ ఎవరా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.