వాళ్ల వల్లే స్టార్ హీరోలకు దూరమయ్యా.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో నటుడు శివాజీ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు.. ఎన్నో కామెడీ చిత్రాలలో బిజీ హీరోగా నిలిచిన శివాజీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నటుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు బలమైన పాత్రలు వస్తే కచ్చితంగా ఎంట్రీ ఇస్తానని ఈ సమయంలోనే టాలీవుడ్ హీరోల పైన సినిమా ఆర్టిస్టుల పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Actor Sivaji: conspiracy to topple Naidu govt | Deccan Herald

శివాజీ తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని కొంతమంది ఎలా తొక్కేయాలని చూసారో తెలియజేయడం జరిగింది.. ఈ క్రమంలోనే చిరంజీవి ,ఎన్టీఆర్ ల నుంచి తనను దూరం చేశారని అందుకు కుట్రలు కూడా చేశారని బయటపెట్టారు. ప్రముఖ ఆర్టిస్టుల వల్ల ఎదురైన ఒక అనుభవం గురించి శివాజీ మాట్లాడుతూ.. ఒక పెద్ద మనిషి చనిపోయారని తండ్రి పోయిన బాధలో ఉన్నారని ఓదార్చడం కోసం ఎన్టీఆర్ను హగ్ చేసుకోవాలని వెళ్ళగా తన రెండు చేతులు పక్కకు తీసేశారని తెలిపారు. వారిని టచ్ చేయాలంటే హోదా ఉండాలని విషయం అర్థం అయిందని తెలిపారు.

Chiranjeevi & Jr NTR follow a similar path

అతను దైవం ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరవుతూ ఉంటారని గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటారని తెలిపారు. జీవితం చాలా చిన్నది.. జీవితంలో ఎందుకంత భేదాలుంటాయని శివాజీ తెలియజేశారు. అయితే ఆయన ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉన్న వ్యక్తి అంటూ ఇంటి ఇవ్వడం జరిగింది.ఆధ్యాత్మిక విషయాల గురించి చెబుతుంటాడని విషయాన్ని హింట్ ఇచ్చానని తెలిపారు శివాజీ. మరొక పెద్ద ఆర్టిస్ట్ గురించి తెలుపుతూ తన పట్ల చాలా జలసిగా ఉండేవారు. తన గురించి లేనిపోనివి నిర్మాతలకు చెప్పి తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా చేసేవారని దీంతో నిర్మాతలు తనకు ఒప్పుకున్న రెమ్యూనరేషన్ ఎగ్గొట్టే వారని తెలిపారు. తన కెరియర్ వేగంగా సక్సెస్ కావడం చూసి తట్టుకోలేక ఇలాంటివి ఆ పెద్ద ఆర్టిస్టు చేశారని తెలిపారు దీంతో చిరంజీవికి తనకు దూరం పెంచాడని తెలిపారు.