రకుల్ ప్రీత్ సింగ్ అందం కోసం ఏం చేస్తుందో తెలిస్తే అవాక్కవుతారు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రకుల్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, హిందీ, తమిళం భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ మధ్య మాత్రం ఈ అమ్మడుకి తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతుంది. రకుల్ ఫిట్నెస్ కి, అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

అంతేకాకుండా రకుల్ తన అందం వెనకున్న సీక్రెట్ ని బయటపెట్టింది. స్లిమ్ గా ఫిట్ గా ఉండటం కోసం జిమ్ లో బాగా కష్టపడే రకుల్ అందం కోసం బ్యూటీ పార్లల్ కి ఎక్కువగా వెళ్లదట. గ్లామర్ ని పెంచుకోడం కోసం ఎక్కువగా నేచురల్ రెమిడీస్ ని ట్రై చేస్తుందట. రకుల్ తన ముఖ సౌందర్యం కోసం రోజు విడిచి రోజు ప్యూర్ కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్ చేసుకుంటుందట. అంతేకాకుండా ముఖం, మెడ మీద ట్యాన్ పోడానికి సమయం టమాటోను రుద్దుకుంటుందట. అలానే పెరుగులో పసుపు, శెనగపిండి కలిపి ప్యాక్ లా వేసుకుంటుందట. ఇవన్నీ రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ వెనుక ఉన్న రహస్యాలట. ఈ విషయాలను స్వయంగా రకుల్ యే చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస సినిమాలతో దుసుకుపోతుంది.