`సామజవరగమన` హిట్ తో రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు.. రీసెంట్ గా `సామజవరగమన` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గ‌త నెల‌లో విడుద‌లైంది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. శ్రీ‌విష్ణు కెరీర్ లోనే హైయ్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ హిట్ తో హీరో శ్రీ‌విష్ణు త‌న రెమ్యున‌రేష‌న్ ను అమాంతం పెంచేశాడ‌ని తాజా ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఇంత‌కు ముందు ఈయ‌నకు కోటి రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు నిర్మాతలు.

కానీ, సామజవరగమన హిట్ తో శ్రీ విష్ణు ద‌శ తిరిగింది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు ఈయ‌న మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. అందుకు ఒక్క రూపాయి త‌గ్గినా సినిమాకు సైన్ చేయ‌న‌ని అంటున్నాడ‌ట‌. దాంతో నిర్మాత‌లు చేసేదేమి లేక‌ శ్రీ విష్ణు అడిగినంత‌ ఇచ్చేందుకు ఓకే చెబుతున్నార‌ని టాక్‌.