ఇండియాలో అత్యంత ధనవంతుడైన హీరో అతనే.. ఆస్తులు ఎన్ని ఉన్నాయంటే..

సౌత్ ఇండియాలో హీరోలు చాలామందే ఉన్నారు. ఆ హీరోలకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల్లో కొంతమంది వారి ఫేవరెట్ హీరోని దేవుడికంటే ఎక్కువగా పూజిస్తుంట్టారు. ఇండస్ట్రీ లో కొంతమంది హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటారు. అలాంటి వారిలో రజినీకాంత్, చిరంజీవి, మోహనలాల్, నాగార్జున, అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటేపోతే పెద్ద లిస్ట్ ఏ ఉంటుంది. అయితే ఇలాంటి హీరోలు వరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం భారీగా లాభపడుతుంటారు. సినిమాల ద్వారానే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా కూడా బాగా డబ్బు సంపాదిస్తుంటారు.

అలా భారీగా సంపాదించిన సౌత్ ఇండియా హీరోల లిస్ట్ బయటకి తీస్తే వారిలో ఒక హీరో టాప్ లో ఉన్నారు. అతను మరెవరో కాదు అక్కినేని నాగార్జున. గత మూడు దశాబ్దాలుగా అత్యంత విజయవంతమైన తెలుగు స్టార్ హీరో ఎవరంటే అక్కినేని నాగార్జున అనే చెప్పాలి. నాగార్జున గతంలో కొన్ని హిందీ సినిమాలో కూడా నటించారు. అయితే కేవలం సినిమా లోనే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా కూడా భారీగా సంపాదించాడు నాగ్. అలానే ఆయన సొంతంగా కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇలా ఆయన పూర్తి ఆస్తుల విలువ చూసుకుంటే సుమారు రూ.  3000 కోట్ల రూపాయలని సమాచారం.

జూమ్ టీవీ నివేదిక ప్రకారం 2022 లో నాగార్జున ఆస్తుల విలువ రూ. 3010 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. సౌత్ ఇండియా లోని అత్యంత ధనవంతుడైన హీరోగా నాగార్జున పేరు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత స్థానాలో వెంకటేష్ రూ. 2200 కోట్లతో, చిరంజీవి రూ. 1650 కోట్లతో రెండు, మూడు స్థానాలో ఉన్నారు. నాలుగవ స్థానంలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రూ. 1370 కోట్లతో ఉండగా, ఆ తరువాత స్థానాలో ఎన్టీఆర్ రూ. 445 కోట్లు, విజయ్ రూ. 445 కోట్లు, రజినీకాంత్ రూ. 430 కోట్లు, కమల్ హాసన్ రూ. 380 కోట్లు, అల్లు అర్జున్ రూ. 350 తో తరువాత స్థానాలో ఉన్నారు. ఇవన్నీ 2022 జూమ్ టీవీ నివేదిక ప్రకారం మాత్రమే ఉన్నాయి.