బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కొద్ది రోజుల క్రితం ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడడుగుల వేసింది. గత కొంత కాలం నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ లో ఫైనల్ గా వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత అటు సిద్దార్థ్ తో పాటు.. ఇటు కియారా కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యాడు.
అలాగే షూటింగ్స్ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా.. ఇద్దరూ వెకేషన్స్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత నెలలో ఒక పిక్ లో కియారా పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. చివరకు అవి రూమర్లుగానే మిగిలియా. కానీ, కియారా నిజంగానే ప్రెగ్నెన్సీ కోసం తెగ ఆరాటపడుతుందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె స్వయంగా వెల్లడించింది.
అయితే మాతృత్వంపై మక్కువ అనుకుంటే పొరపాటే అవుతుంది. అసలు కియారా ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటుందో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది. `గుడ్ న్యూస్` సినిమా రిలీజ్ టైమ్ లో కియారా మాట్లాడుతూ.. తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని, ఎందుకంటే ఆ టైమ్ లో నచ్చింది తినొచ్చ, అడ్డు చెప్పేవారే ఉండరని వెల్లడించింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ హెల్తీగా ఉంటే చాలని ఆమె పేర్కొంది. మొత్తంగా నచ్చిన ఫుడ్ తినడం కోసం కియారా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యాఖ్యలు నెట్టింట మరోసారి వైరల్ గా మారాయి.