వెడ్డింగ్ డ్రెస్‌లో క్యూట్ పోజులు.. కీర్తి సురేష్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా…

ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల పాన్ ఇండియా సినిమా ‘దసరా’ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘బోళా శంకర్ ‘ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ దిగిన క్రేజీ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని కృషి చేసింది. మోడరన్ డ్రెస్ లోనే కాకుండా చీరల్లో, చుడీదార్స్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కీర్తి సురేష్. తాజాగా బ్లాక్ వెడ్డింగ్ డ్రెస్ లో కనిపించి క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దానికి సంబందించిన ఫొటోస్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

కీర్తి ఆ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్ ఆమె డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసుకొని నోరెళ్లబెడుతున్నారు. కీర్తి సురేష్ తాజాగా మాన్ సూన్ వెడ్డింగ్ ఔట్ఫిట్ కు పర్ఫెక్ట్ అయిన డ్రెస్ వేసుకుంది. ప్రముఖ డిజైనర్ అనితా డొంగ్రే డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ జరీనా సెట్ లో మెరిసింది మన మహానటి. కుందన్, సీక్వెన్స్లతో కూడిన ఈ అందమైన బ్లాక్ డ్రెస్ లో కీర్తి అందం మరింత పెరిగిపోయింది. అయితే ఈ డ్రెస్ ఖరీదు రూ. 75000 అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.