`బేబీ` ఫేమ్‌ విరాజ్ అశ్విన్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. గిన్నిస్ రికార్డు కూడా కొల్ల‌గొట్టాడు!

బేబీ.. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించారు. విరాజ్ అశ్విన్ సెకండ్ హీరోగా చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే అంశాల‌తో ఈ మూవీను రూపొందించారు.

దీంతో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద బేబీ దుమ్ము దుమారం రేపుతోంది. క‌లెక్షన్స్ ను ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోగా న‌టించిన విరాజ్ అశ్విన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి నెటిజ‌న్లు సెర్చ్‌ చేయ‌డం షురూ చేశారు. బేబీలో ఆనంద్ కు పోటీగా విరాజ్ న‌టించాడు. ఈ టాలెంటెడ్ న‌టుడిగా గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు.

`అనగనగా ఓ ప్రేమ కథ` మూవీతో విరాజ్ అశ్విన్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కూడా అత‌డే. అయితే ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో కూడా తెలియ‌దు. కానీ, అన‌సూయ‌తో న‌టించిన `థ్యాంక్యూ బ్రదర్‌` మూవీతో విరాజ్ కు మంచి గుర్తింపు ద‌చ్చింది. మ‌రో ఇంట్రెస్టింగ్ విజ‌యం ఏంటంటే.. విరాజ్ అశ్విన్ అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అత‌ను హీరోగా న‌టించిన షార్ట్ ఫిల్మ్ `మనసానమః` అంతర్జాతీయ స్థాయి లో అత్య‌ధికంగా 513 అవార్డ్స్ ని దక్కించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. ఇక విరాజ్ అశ్విన్ ఇటీవల `మాయ పేటిక` ద్వారా ప్రేక్ష‌ల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా అలా ఇచ్చి ఇలా వెళ్లింది. కానీ, బేబీ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో విరాజ్ కు మ‌రిన్ని ఆఫ‌ర్లు క్యూ క‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.