ఆ ఒక్క కార‌ణంతో `బేబీ` మూవీని మిస్ చేసుకున్న క్రేజీ హీరో.. చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైందా?

బేబీ.. ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. కలర్ ఫోటో చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌రకొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించారు. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం.. శుక్ర‌వారం విడుద‌లైంది.

అయితే ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ల‌భించింది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. ఇదే త‌రుణంలో బేబీ మూవీకి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. నిజానికి బేబీ మూవీ ఆనంద్ దేవ‌ర‌కొండ కాదు విజ‌య్ దేవ‌కొండ చేయాల్సింద‌ట‌. అవును, సాయి రాజేష్ మొద‌ట విజ‌య్ కే బేబీ క‌థ చెప్పాడ‌ట‌.

కానీ, ఈ చిత్రం లో ఎక్కువగా హీరోయిన్ పాత్రకే స్కోప్ ఉండడం తో విజయ్ దేవరకొండ సున్నితంగా నో చెప్పాడ‌ట‌. అయితే స్టోరీ చాలా బాగుండ‌టంతో ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో తీయ‌మని చెప్పాడ‌ట‌. అలా విజ‌య్ ప్లేస్ లో ఆనంద్ వ‌చ్చాడు. ఆనంద్ కెరీర్ కు ఈ మూవీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైంద‌ని కూడా అంటున్నారు. ఎందుకంటే, విజ‌య్ రేంజ్ మూవీ కాద‌ది. ఈ విష‌యం తెలిసే విజ‌య్ కూడా నో అన్నాడు