సలార్ చిత్రంలో మరో తెలుగు యాక్టర్..!!

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య భారీ ఎలివేట్ చేసే ప్రముఖులు సైతం ఇందులో నటిస్తూ ఉన్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్నది. అలాగే కీలకమైన పాత్రలలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటిస్తూ ఉన్నారు. జగపతిబాబు, శ్రీయ రెడ్డి కూడా నటిస్తోంది.

Prabhas, Prashanth Neel to collaborate indeed after 'Salaar'

అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది. ఎన్నో చిత్రాలలో నటుడుగా కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలలో నటించి మెప్పించిన బ్రహ్మాజీ నేటి యువ హీరోల సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తన కుమారుడు సంజయ్ రావు కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం హస్బెండ్.. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మాజీ సలార్ సినిమాల తాను కూడా నటించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది తాను గ్రే షేడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలియజేశారు. స్వధాగా ఆయన పాత్ర పాజిటివ్ అయినప్పటికీ కాస్త మాస్ నెగటివ్ స్టేట్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో కనిపిస్తారా లేకపోతే రెండవ భాగంలో అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి సినీ క్రియలు బ్రహ్మాజీకి అభినందనలు సైతం తెలియజేస్తున్నారు.