ట్రెడిషనల్ లుక్‌లో తళుక్కుమన్న యాంకర్ శ్రీముఖి.. దాసోహం అంటున్న ఫ్యాన్స్!

ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు యాంకర్ గా ఇంకోవైపు నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానులమనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బుల్లితెర రాములమ్మనే దర్శనమిస్తుంది. ఒకవైపు వరుస టీవీ షోలలో బిజీగా ఉన్నా మరోవైపు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది శ్రీముఖి.

శ్రీముఖి ఇప్పటికే చాలా సినిమాలలో చిన్న పాత్రలో నటించడమే కాకుండా, కొన్ని సినిమాలలో మెయిన్ హీరోయిన్‌గా కూడా నటించి ప్రేక్షకులను అల్లరించింది. సినిమాలో, షో స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా గ్లామరస్ ఫొటోలను షేర్ చేసి బాగా వైరల్ అవుతుంది.

గ్లామరస్ ఫొటోలతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషనల్ వేర్‌లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసి అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బుల్లితెర రాములమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సంప్రదాయమైన దుస్తులు వేసుకొని చాలా పద్దతిగా దర్శనమిచ్చింది. ఆ సంప్రదాయ దుస్తులలో శ్రీముఖి చాలా క్యూట్ గా కనపడుతుంది. ప్రస్తుతం శ్రీముఖి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.