అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ.. ఇక వివాదమేనా..?

బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు టీవీ షోలలో వచ్చే విమర్శలపైన ట్రోల్స్, బాడీ సేమింగ్స్ వంటి వాటిని తట్టుకోలేక బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. సినిమాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించింది అనసూయ. పుష్ప -2 చిత్రంలో కూడా ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది. మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలతో నటిస్తున్న అనసూయ ప్రస్తుతం బిజీ యాక్టర్ గా మారిపోయింది.

Allu Arjun & Anasuya, Adding Publicity Both Ways!

అయితే అనసూయ, అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అందుకు సంబంధించి ఒక వోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ హీరో ఏంటి అంటూ కామెంట్లు చేసింది.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా అంటూ అనసూయ స్టార్ట్ చేసింది. గంగోత్రి సినిమా చూసి అసలు మన వాళ్లకు ఏమైంది అంటూ ఆశ్చర్యపోయింది. ఆ పాటలు మాత్రం అసలు చూడలేకపోయాను అంటూ తెలియజేసింది అనసూయ.

అల్లు అర్జున్ ఒక పాటలు లేడీ గెటప్ లో కనిపిస్తూ అసలు అల్లు అర్జున్ ని అలా చూడలేము అంటూ ఈ వీడియోలో మాట్లాడినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అనసూయ పైన పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.. దాదాపుగా 8 ఏళ్ల క్రితం ఈ వీడియో విడుదలైనట్టుగా తెలుస్తోంది. అప్పట్లో ఈమె పైన ఫైర్ అవ్వడం కూడా జరిగింది అభిమానులు కానీ ఇప్పుడు అనసూయ అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తోంది.