అలా కనిపించేందుకు నాకేం భయం లేదంటూ ఆదిపురుష్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దీపిక పదుకొనే యాక్షన్ జానర్ వైపు వెళ్తుంటే కృతి సనన్ మాత్రం డిఫరెంట్ పాత్ ని చూజ్ చేసుకుంటుంది. ఈ అమ్మడు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తుంది. మొదట నటిగా మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్టార్ రేస్ లోకి వచ్చేస్తామని ఫీల్ అవుతుంది కృతి. ఈ బాలీవుడ్ భామ కెరీర్ ప్రారంభంలో కాస్త తడిబడినప్పటికీ ఇప్పుడు మాత్రం మంచి సక్సెస్ తో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్టులోకి కృతి పేరు కూడా చేరిపోయింది. ఈ అమ్మడు నటించిన మిమి సినిమా సక్సెస్ తరువాత కృతికి అందం, అభినయం ఉన్న హీరోయిన్ అని పేరు వచ్చింది. దాంతో స్టార్ హీరోలు ఈ అమ్మడుతో జతకట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో కృతి సనన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. మిమి తరువాత ఎక్కువగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఈ బ్యూటీ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిగా ప్రేక్షకుల ముందుకు వచింది.

ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రలకు కూడా రెడీ అంటుంది ఈ చిన్నది. కృతి సనన్ ఎక్కువగా డిఫరెంట్ రోల్స్ లో నటించేందుకు ఇష్టపడుతుంది. గతంలో బేడియాలో గ్లామర్ షోకు దూరంగా షార్ట్ హెయిర్ తో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఆమె లుక్స్ చూసి చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ కృతి అవేమీ పట్టించుకోకుండా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డి గ్లామర్ లుక్ లో కనిపించేందుకు నాకేం భయం లేదు అని సమాధానం చెప్పింది. కథ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి లుక్ లో కనిపించడానికి అయినా నేను రెడీగా ఉన్నాను అని అంటుంది మన ఆదిపురుష్ హీరోయిన్.