బాబాయిని గుడ్డిగా ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. తేడా వస్తే అంతే సంగతులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసం లో జరిగింది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా పూర్తి అయింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరు అయ్యారు.

ఇక వరుణ్ ఒక ఇంటి వాడు అవుతుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటి అయిన జంటను చిరంజీవి ఆశీర్వదించారు. ఇక నిహారిక ట్విట్టర్ లో ‘వెల్కమ్ టూ ధ ఫ్యామిలీ వదిన’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఇక మెగా కుటుంబ సభ్యుల భార్యలు అందరూ కూడా బిజినెస్ రంగానికి చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వారే, చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, వీరందరూ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబము నుంచి వచ్చిన వారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం ఒక యాక్ట్రెస్ వీరి కుటుంబానికి ఎటువంటి బిజినెస్ నేపధ్యం లేదు. ఇక తాజాగా వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి ను పెళ్లి చేసుకోబోతున్నాడు, లావణ్య కుటుంబానికి సైతం ఎటువంటి బిజినెస్ నేపథ్యం లేదు. దీనితో వరుణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నాడంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చ పెట్టారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ మాత్రం లావణ్యతో జీవితాంతం కలిసి వుండాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వరుణ్ లవ్ విషయానికొస్తే వీరిద్దరూ 2016 వ సంవత్సరం నుంచి లవ్‌లో ఉన్నారు, మిస్టర్ సినిమాతో వీరి ప్రేమ ఇంకా బలపడి పెళ్లి వరకు వచ్చింది.