పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు వీరే..

సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందం, టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. అయితే అలా కష్టపడి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినీ జీవితానికి దూరమయ్యారు. ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ఊహ :- 1996లో శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘ఊహ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ ఊహ. 1997లో శ్రీకాంత్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయింది.

• నమ్రత :- ‘వంశీ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకుంది. తరువాత ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఆ తరువాత కుటుంబ బాధ్యతలు చేపట్టి మహేష్ బాబు సినిమాకి సంబందించిన పనులను చూసుకుంటుంది. ఈ అందాల తార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విశేషాలు పంచుకుంటుంది.

• అసిన్ :- అసిన్ తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. మైక్రో మాక్స్ సంస్థ సీఈఓ రాహుల్ శర్మని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది.

• రేణుదేశాయ్ :- ప్రముఖ నటి రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తరువాత ఇండస్ట్రీ కి దూరం అయింది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర గానే ఉంటుంది.

• లయ: ప్రముఖ నటి లయ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకొని అమెరికా కి వెళ్లిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ నాజూకైన మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది.