ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి..!!

ఈ ఏడాది వెండితెర బుల్లితెర సెలబ్రెటీలు సైతం వరుసగా వివాహాలు చేసుకుంటూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు.. ఈ రోజున ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. గత కొద్ది రోజుల క్రితం నటుడు శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జైపూర్ లో జరిగింది.వీరి రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిన్నటి రోజున మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది.

kevvu karthik Marriage: జబర్దస్త్ కెవ్వు కార్తిక్ పెళ్లి ఫొటోలు.. జోడి నిజంగా బావుందన్నా! - jabardasth comedian kevvu karthik wedding pics goes viral - Samayam Telugu
ఈ ఏడాది వీరు కూడా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.అటు బుల్లితెర నుండి తాజాగా జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ కూడా ఒక ఇంటివాడయ్యారు. శ్రీలేఖ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కార్తీక్ ,శ్రీలేఖల పెళ్లి హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యి ఈ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. బుల్లితెర నుంచి పలు ఆర్టిస్టులు కూడా హాజరై ఈ వేదిక కు మరింత అందాన్ని తీసుకురావడం జరిగింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఈ ఫోటోలు చూస్తున్న నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెళ్లికి ముందే తన భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేసిన కార్తిక్ మొదట ఆమె ఫేస్ ని చూపించకుండా ఆ తర్వాత రివీల్ చేశారు. ఎంతమంది సెలబ్రిటీలు మంచి స్థాయికి వచ్చిన తరువాతే వివాహం చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు.