కాజ‌ల్ కు ఎంత క‌ష్ట‌మొచ్చింది.. ఆ నొప్పి భ‌రించ‌లేక కేక‌లు పెడుతున్న చంద‌మామ‌!

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన అందాల‌ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. 2020లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూతో కాజ‌ల్ ఏడ‌డుగులు వేసింది. పెళ్లి అయిన కొద్ది నెల‌ల‌కే ప్రెగ్నెంట్ అయిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది పండండి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

త‌న‌యుడికి నీల్ కిచ్లూ అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేసింది. ఇక‌పోతే ప్రెగ్నెన్సీ కార‌ణంగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ కాస్త బ‌రువు పెరిగింది. ఆ బ‌రువును త‌గ్గించుకుని.. మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని ఈ అమ్మ‌డు గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతోంది. బిడ్డ పుట్టిన ఆరు నెల‌ల‌కే కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన కాజ‌ల్‌.. అవ‌కాశాల కోసం మ‌ళ్లీ మునుప‌టిలా మారేందుకు జిమ్ లో తెగ శ్ర‌మిస్తోంది.

తాజాగా జిమ్ లో ట్రైన‌ర్ స‌మ‌క్షంలో కాజ‌ల్ వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోలో హెవీ వ‌ర్కౌట్స్ చేస్తున్న స‌మ‌యంలో నొప్పి భ‌రించ‌లేక కాజ‌ల్ కేక‌లు పెడుతుండ‌టం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కాజ‌ల్ కు ఎంత క‌ష్ట‌మొచ్చింది అని కొంద‌రు.. చంద‌బాబ బాగా త‌గ్గిపోయింద‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. కాగా, కాజ‌ల్ తెలుగులో బాల‌య్య‌కు జోడీగా `భ‌గ‌వంత్ కేసరి` మూవీలో న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియాన్ 2` ప్రాజెక్ట్ లో భాగ‌మైంది.