వరుణ్ తేజ్- లావణ్య కు తొడిగిన రింగ్ ధర తెలిస్తే షాక్..!!

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూనే ఉండేవి.. అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి మాత్రం ఎప్పుడు ఖండిస్తూ వస్తూ ఉండేది. కానీ ఈ నెలలో ఎక్కువగా వీరినిచ్చితార్థం గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉండడంతో మరొకసారి వీరిద్దరి ప్రేమ గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా బంధువుల సమక్షంలో మెగా కుటుంబ సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

Telugu stars Varun Tej, Lavanya Tripathi engaged
పలు రకాల ఫోటోలను లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2016 నుంచి మేము ప్రేమించుకుంటున్నామంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థంలో వరుణ్ తేజ్ ,లావణ్య ఒకరినొకరు చాలా ఖరీదైన ఉంగరాలు తొడిగినట్టుగా తెలుస్తోంది దాదాపుగా ఈ రింగ్స్ విలువ రూ .25 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. వరుణ్ రూ .2 లక్షల విలువైన కూర్త పైజామా కూడా ధరించిన లావణ్య త్రిపాఠి రూ .3 విలువైన బెనారస్ సారి కట్టుకున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు కూడా మిస్టర్ అంతరిక్షం అనే చిత్రాలలో కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలియజేయడం జరిగింది. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.