`లెజెండ్` మూవీ లో జగపతిబాబు రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `లెజెండ్‌` ఒక‌టి. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యాన‌ర్ల‌పై ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు.

2014లో విడుద‌లైన ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసి ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు. అలాగే ప్రతినాయకుడు జితేంద్ర పాత్రలో జగపతిబాబు అద‌ర‌గొట్టేశాడు. ఈ సినిమాతో ఆయ‌న జాత‌కమే మారిపోయింది.

హీరోగా కెరీర్ క్లోజ్ అనుకుంటున్న త‌రుణంలో.. లెజెండ్ మూవీతో విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు ట‌ర్న్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అయితే నిజానికి లెజెండ్ మూవీలో విల‌న్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ జ‌గ‌ప‌తిబాబు కాదు. మొద‌ట సీనియ‌ర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ను సంప్ర‌దించార‌ట‌. కానీ, విల‌న్ పాత్ర‌లు చేయ‌డం ఇష్టం లేని రాజ‌శేఖ‌ర్‌.. సున్నితంగా లెజెండ్ ను రిజెక్ట్ చేశారు. ఒక‌వేళ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి ఉండే.. ఆయ‌న కెరీర్ మ‌రో రేంజ్ లో ఉండేది అన‌డంలో సందేహం లేదు.