ప్రేమలో విహరిస్తున్న బుల్లితెర నటి మోనిత..!

బుల్లితెరపై నటి శోభిత శెట్టి గురించి చెప్పాల్సిన పనిలేదు.. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులో మోనిత గా మంచి పాపులారిటీ సంపాదించింది.. తాజాగా బుల్లితెర నటి శోబితా ప్రేమలో ఉందని అనుమానాలు కూడా వెలుబడుతున్నాయి. శోభిత శెట్టి కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడ తెలుగు బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ అమ్మడు. తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా కార్తీకదీపం సెట్ లో జరిగేటువంటి వీడియోలను తీసి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. గత ఏడాది ఒక వెబ్ సిరీస్ లో నటించిన ఆ సిరీస్ బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ ద్వారా నిత్యం ఏదో ఒక విధంగా పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది శోబిత శెట్టి.

దుస్తులకు సంబంధించి ఫోటోషూట్లకు సంబంధించి వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది.. కార్తీకదీపం సీరియల్ ముగిసినప్పటికీ ఈమె అభిమానులు ఎక్కువగా మోనిత అని పిలుస్తూ ఉంటారు. మౌనిత ప్రస్తుతం పలు సీరియల్స్ లో కూడా బిజీగా ఉంటోంది. కార్తీకదీపం సీరియల్స్ లో నటించిన నటుడు యశ్వంత్ అందరికీ గుర్తుంటుంది. ఈ సీరియల్స్ అతడు మోనిత ప్రేమించిన వ్యక్తికి తమ్ముడుగా నటించారు. అయితే మౌనిక కార్తీకదీపం సీరియల్ అప్పటినుంచి దళిత బాగా క్లోజ్ గా ఉన్నట్లు సమాచారం.అతనితో కలిసి వీడియోలు చేస్తూ హోం టూర్లు వంటివి చేస్తూ ఉంటుంది.వీరి మధ్య లవ్ నడుస్తోందని అనుమానాలు కూడా వెలుబడుతున్నాయి. తాజాగా పంచుకున్నటువంటి స్టోరీస్ ని చూస్తే వీరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.