పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో భాగమైన టాప్ స్టార్స్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ రెమ్యునరేషన్ తో ఏదు సినిమాలు తీయొచ్చు. ఎందుకంటే, ప్రాజెక్ట్ కె కోసం ఆయన ఏకంగా రూ. 150 కోట్లు పుచ్చుకుంటున్నాడట.
అలాగే ఆయన తర్వాత కమల్ హాసన్ అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్నారు. రూ. 20 కోట్ల వరకు కమల్ హాసన్ `ప్రాజెక్ట్ కె` కోసం ఛార్జ్ చేస్తున్నారట. ఇక అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్లు, దీపికా పదుకొణె రూ. 15 కోట్లు, దిశా పటానీ రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ లెక్కన కేవలం పారితోషికం కోసమే మేకర్స్ రూ. 200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఖంగుతింటున్నారు.