ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ని అమరావతికి పిలిచి..ఆయనతో జగన్ సెపరేట్ గా సమావేశం కావడంతో..ఆ 18 మందిలో అనిల్ ఒకరు అని క్లారిటీ వచ్చేసింది. అనిల్ పనితీరు పెద్దగా బాగోలేదని వైసీపీ వర్గాల్లోనే టాక్ నడుస్తుంది. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి చాలా తక్కువ మెజారిటీతో గెలిచి జగన్ కేబినెట్ లో ఛాన్స్ కొట్టేశారు. కానీ మంత్రి పదవిని సమర్ధవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో మధ్యలోనే పదవి పోయింది. ఇక ఎమ్మెల్యేగా ఏమైనా మెప్పిస్తున్నారా? అంటే అది లేదు.
నెల్లూరు సిటీలో అభివృద్ధి పెద్దగా లేదు..అనిల్ సైతం అక్కడ ప్రజలకు అందుబాటులో కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. గడపగడపకు తిరిగేది తక్కువ. ఇక అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి ఆరోపణలు చేస్తుంది. ఇదే సమయంలో అనిల్‌కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ పావులు కదుపుతున్నారు. చాలామంది వైసీపీ నేతలు అనిల్ కు యాంటీగా మారిపోయారు. దీంతో అనిల్ కు నెక్స్ట్ గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అనిల్ ని పిలిపించి జగన్ మాట్లాడారు..అందరినీ కలుపుకుని వెళ్ళి పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు.మరి ఇకనుంచి అనిల్ పనితీరు మారుతుందేమో చూడాలి..లేదంటే గెలుపు కష్టమే..అసలు సీటు దక్కడమే డౌటే.