బాహుబలి సినిమా పై పెదవి విప్పిన తమన్నా..

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి-1, బాహుబలి -2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టాయి.. రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ముఖ్యంగా ఇందులో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. తాజాగా బాహుబలి సినిమాలో నటించిన తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

HD wallpaper: Tamanna Avantika Bahubali | Wallpaper Flare
ఈ సినిమాలో నటించడం వలన తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని తెలియజేసింది.. తమన్నా మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లాంటి వాళ్ల కేవలం హీరోలకు మాత్రమే గుర్తింపు వస్తుందని తన అభిప్రాయంగా తెలియజేసింది. ఈ చిత్రంలో నటించిన రాణా ప్రభాస్ ఇద్దరూ కూడా గ్లోబల్ స్థాయిలో సక్సెస్ అయ్యారు అలాగే రమ్యకృష్ణ అనుష్క కూడా కొంత పేరు లభించింది కానీ తన పాత్ర మాత్రం అతిధి పాత్రగానే ఉండిపోయిందని తెలియజేసింది.. ఈ చిత్రం కోసం ప్రభాస్ రానా ఇద్దరు చాలా కష్టపడ్డారు వాళ్లు కచ్చితంగా ప్రశంసలకు అర్హులని తెలిపింది..

Tamanna Bhatia vs Anushka Shetty: Rate The Best Baahubali Queen? | IWMBuzz
బాహుబలి సినిమా సక్సెస్ను తాను క్యాష్ చేసుకోలేకపోయానని కానీ ఆ సినిమాలో చిన్న పాత్ర అయినా చాలా కీలకమని చాలా సంతోశంగా తెలియజేసింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా చిరంజీవి నటించిన భోళా శంకర్ నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది ఆ తర్వాతే రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా పలు వెబ్ సిరీస్లో సినిమాలలో నటిస్తు బిజీగా ఉంటోంది.