టాలీవుడ్ ని ఏలేస్తున్న శ్రీ లీల.. ఎన్ని చిత్రాలంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది. కానీ తన అంద చందాలతో డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత రవితేజ నటించిన ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది శ్రీలీల.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ…

Sreeleela Biography, Age, Wiki, Family – Filmy Glitz

జూన్ 14వ తేదీన నిన్నటి రోజున శ్రీ లీల పుట్టినరోజు సందర్భంగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలు నుంచి ఫస్ట్ లుక్స్ వైరల్ గా మారుతున్నాయి.. దాదాపుగా ఈ ముద్దుగుమ్మ చేతిలో పది సినిమాలకు పైగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఇందులో ఎనిమిది సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో ఆరు సినిమాలు సెక్స్ పైన షూటింగ్ జరుగుతున్నాయి మరికొన్ని చిత్రాలు త్వరలోనే షూటింగ్ పార్ట్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో శ్రీ లీల దాదాపుగా క్షణం తీరిక లేకుండానే బిజీగా షూటింగ్లో గడిపేస్తోంది ఇలా నెలల తరబడి చేస్తున్నట్లు సమాచారం శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఈమె గురించి ట్విట్టర్లో పలు రకాల ఫోటోలు సైతం రెడీగా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలు విషయానికొస్తే వైష్ణవ తేజ్ సరసన ఆది కేశవ సినిమా బాలయ్య కూతురు పాత్రలో భగవంత్ కేసరి.. మహేష్ బాబుతో గుంటూరు కారం.. హీరో రామ్ పోతినేని తో ఒక సినిమాలో నటిస్తోంది. ఆహా ఓటీడీ కోసం అల్లు అర్జున్ నటిస్తున్న ప్రాజెక్టులు నటిస్తోంది అలాగే నితిన్ నటిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.