ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్‌గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది.

అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా ప్రమోషన్లలో తన పేరు వాడుకున్నారంటూ ఆరోపించింది. మూవీస్ మేకర్స్‌పై సైతం ఫైర్ అయింది. . తన మాజీ ప్రియుడు అభిరామ్ కు శాపనార్ధాలు పెడుతూ రెచ్చిపోయింది.

అభిరామ్ పై రెచ్చిపోవడం ఇదేం మొదటిసారి కాదు. శ్రీ రెడ్డి అతనిని తనకు ఖాళీ దొరికినప్పుడల్లా తిడుతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోవడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ శ్రీ రెడ్డి పై మండిపడితున్నారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి తిట్ల వీడియో వైరల్ అవుతోంది. డైరెక్టర్ తేజను టార్గెట్ చేయడం శ్రీ రెడ్డి కి కొత్త కాదు. కాజల్ అగర్వాల్ నటించిన సీత చిత్రం విడుదల సమయంలోనూ తేజ పై మండి పడింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం బెంగుళూరు కు షిఫ్ట్ అయిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తుంది. ఇక శ్రీ రెడ్డి కామెంట్స్ పై అభిరామ్, తేజ ఎలా స్పందిస్తారో చూడాలి.