“నాకు ఆ అదృష్టం లేకుండా చేసాడు..ఇప్పటికి ఆ విషయంలో దేవుడిని తిట్టుకుంటా”.. సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత అందంగా ఉంటుందో అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో అందరి మనుసులని దోచేసుకుంటుంది సునీత. కాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతున్న సింగర్ సునీత రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ అందరిని ఎమోషనల్ గా టచ్ చేసింది. మనకు తెలిసినదే సింగర్ సునీత సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి మధ్య ఉన్న విడతీయరాని అనుబంధం . వీళ్లిద్దరూ కలిసి ఎన్నో షోస్ చేశారు . ఎన్నో మ్యూజిక్ ఈవెంట్స్ చేశారు .

వీరిద్దరూ కలిసి పాడుతా తీయగా షో ని కొన్ని ఏళ్ల తరబడి కంటిన్యూ చేశారు . అంతే కాదు ప్రొఫెషన్ కి మించి మంచి కుటుంబ సభ్యులు లాగా కలిసిమెలిసి ఎన్నో విషయాలను చర్చించుకునేవారు. బాలుని సునీత మామయ్య అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పిలిచేవారట . ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది . అంతటి సాన్నిహిత్యం ఉన్న గొప్ప మనిషిని కోల్పోవడం సింగర్ సునీత ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు బాలసుబ్రమణ్యం పుట్టిన రోజు. దీంతో చాలా ఎమోషనల్ అయ్యింది సునీత.

సోషల్ మీడియా వేదికగా ..”నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞ్యాపకం ఆంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడ్ని ఈరోజుమాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా..” అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకోచ్చారు . మనకు తెలిసిందే 2020 సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఆయన కరోనా మహమ్మారి బారిన పడిన తర్వాత మైల్డ్ అటాక్ రావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రిలో చేరిన బాలు వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజులపాటు పోరాడి మరణించారు . దీంతో సినీ సంగీత ప్రపంచం మూగబోయింది. ఈ క్రమంలోనే నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా సింగర్ సునీత చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)