రామ్ చ‌ర‌ణ్ కూతురికి శ‌ర్వానంద్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఫ్రెండ్షిప్ అంటే ఇది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డ‌కు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు మెగా కాంపౌండ్ లో ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వచ్చింది. రామ్ చరణ్ కూతురు కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌ స్పెషల్ గిఫ్ట్ పంపాడ‌ట‌. రామ్ చరణ్, శర్వానంద్ చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న‌ సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతోనూ శర్వానంద్ కి మంచి అనుబంధం ఉంది.

ఇటీవల జరిగిన శర్వానంద్ పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. ఇక తాజాగా శర్వానంద్ తన ఫ్రెండ్షిప్ ను మరోసారి చాటుకున్నాడు. రామ్ చరణ్ కూతురి కోసం ఖరీదైన బ్రాండెడ్ బేబీ ప్రొడక్ట్స్ ను గిఫ్ట్ చేశాడట. అలాగే పాపకు దుస్తులు, బొమ్మలు పంపించాడట. అంతేకాదు చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడ‌ట‌. ఇక శ‌ర్వా ఇచ్చిన ఈ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ చూసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతగానో మురిసిపోయాలని నెట్టింట‌ టాక్ నడుస్తోంది.