చీర‌లో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన ప్ర‌ణీత‌.. ఇంత హాట్‌గా ఉందేంట్రా బాబు!

కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెర‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. బావ మూవీ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అయితే అందం అభిన‌యం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ప్రణీతకు ఇక్క‌డ పెద్ద‌గా ఆఫ‌ర్లు ద‌క్క‌లేదు.

కానీ, కన్నడలో మాత్రం బాగానే క్రేజ్‌ సంపాదించుకున్న ప్రణీత.. 2021లో నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. గ‌త ఏడాది ఓ పండంటి ఆడ బిడ్డు జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లైనా.. ప్ర‌ణీత గ్లామ‌ర్ మాత్రం త‌గ్గ‌లేదు.

వివాహం అనంత‌రం కూడా కెరీర్ ప‌రంగా బిజీ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌ణీత‌.. త‌ర‌చూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ చీర‌లో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది.

స్కిన్ షోతో రెచ్చిపోయింది. చీరలో హోయలో పోతూ కుర్రకారు గుండెలు అదిరిపడేలా ఫోజులు ఇచ్చింది. ప్ర‌ణీత తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఇంత హాట్‌గా ఉందేంట్రా బాబు అంటూ నెటిజ‌న్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.