హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను తట్టుకోవడం కష్టం అని అంటారు. చిరంజీవి నిత్యం సినీ వర్గాలకు చాలా సాయం చేస్తుంటారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయనను హీరోయిన్ మాధవి ఘోరంగా అవమానించారు. ఆమె పక్కనే కారులో కూర్చోగానే ఆమె చాలా దారుణంగా మాట్లాడిందట. తన పక్కనే కూర్చునే స్థాయా నీది అంటూ అవమానించినట్లు తెలుస్తోంది. అప్పుడు తాను ఇండస్ట్రీకి కొత్త కావడంతో ఏమీ అనలేదట.

చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని ఎవరైనా అవమానించే సాహసం చేయరు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా ఆయనకు విస్మయకర అనుభవం ఎదురైంది. చిరంజీవితో పాటు సినిమా యూనిట్‌ను సైతం అవమానించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నగ్మ. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస హిట్లు దక్కడంతో ఆమె చాలా పొగరుగా ఉండేదట. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి సరసన ఆమె నటించింది. ఆ సినిమా టాలీవుడ్ లో, చిరంజీవి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్లు సినిమాలో కూడా చిరుతో ఆమె నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ప్రవర్తన బాగుండేది కాదట. షూటింగ్‌కు సమయానికి వచ్చేది కాదు.

దీంతో ఆమెను పర్సనల్‌గా పిలిచి సరికాదని చెప్పారట చిరంజీవి. అయితే ఆమె చిరంజీవి వద్ద కూడా ఓవర్ యాక్షన్ చేసిందట. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆమెకు చెంపపై చిరు ఒక్కటిచ్చారని సినీ వర్గాల సమాచారం. ఇలాగే ప్రవర్తిస్తే కెరీర్ నాశనం అవుతుందని, పద్ధతి మార్చుకోవాలని చిరు గట్టిగా చెప్పారు. అప్పటి నుంచి ఆమె మారి, సినిమా యూనిట్‌కు సహకరించిందని తెలుస్తోంది.