మైసూర్ లో ఆ యంగ్ హీరోయిన్ తో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్న రామ్.. ఏంటి గురూ సంగ‌తి?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం మైసూర్ లో ఓ యంగ్ హీరోయిన్ తో క‌లిసి మ‌స్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంత‌కీ ఆ యంగ్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు శ్రీ‌లీల‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ జంట‌గా ఓ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే `RAPO20`. బోయపాటి శ్రీ‌ను ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌స‌రా పండుగ కానుక తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ మూవీ మేజ‌ర్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తైంది. ఇటీవ‌లె దాదాపు పాతిక రోజులు క్లైమాక్స్ ను చిత్రీక‌రించారు.

ఇక తాజాగా షెడ్యూల్ మైసూర్ లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద ప‌లు కీలక సన్నివేశాలను షూట్ చేయ‌బోతున్నారు. అలాగే ఒక సాంగ్ ను కూడా చిత్రీక‌రించబోతున్నారు. జూన్ 15 వరకు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌లీలతో క‌లిసి రామ్ మైసూర్ వెళ్లాడు. అయితే షూటింగ్ గ్యాప్ లో శ్రీ‌లీలతో క‌లిసి రామ్ మైసూర్ అందాల‌ను ఆశ్వాదిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్ బ‌య‌కు రావ‌డంతో.. జోడీ బాగుంది, ఏంటి గురూ సంగ‌తి అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.