అమ్మ బాబోయ్‌.. `పెళ్లి సంద‌డి`లో శ్రీ‌కాంత్ కలల రాకుమారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

హీరో శ్రీ‌కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `పెళ్లి సంద‌డి` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇంద‌లు శ్రీ‌కాంత్ కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా న‌టించారు.

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో శ్రీ‌కాంత్ క‌ల‌ల రాకుమారిగా న‌టించిన దీప్తి భట్నాగర్ గుర్తుందా..? ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు. ఉత్త‌రాదికి చెందిన‌ దీప్తికి పెళ్లి సంద‌డినే మొద‌టి చిత్రం. తొలి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఆమెకు టాలీవుడ్ లో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.

నాగార్జున‌, బాలకృష్ణ, రాజశేఖర్‌, మోహన్‌ బాబు వంటి హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో కంటే బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా న‌టించిన దీప్తి.. 2007 త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆర్యతో ఏడడులు వేసి ఇద్దరు కుమారుల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం నిర్మాణ రంగంలో ఉన్న దీప్తి.. ప‌లు టీవీ షోస్ ను రూపొందిస్తోంది. ఇక‌పోతే అప్ప‌ట్లో నాజూగా, కుర్ర‌కారు స్వప్నసుందరిలా ఉండే దీప్తి.. ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయింది. అయితే బ‌రువు పెరిగిన ఆమె అందం మాత్రం చెక్క‌చెద‌ర‌లేదు. దీప్తి తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.