యంగ్ హీరో సినిమా కోసం తిప్పలు పడుతున్న నిహారిక.. అతను ఎవరంటే..

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్ముడు హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇటీవల ‘డెడ్ పిక్సెల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన నిహారిక సోషల్ మీడియాలో మామూలుగా రచ్చ చేయడం లేదు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకోకుండా గ్లామర్ పంట పండిస్తుంది. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వడానికే ఇలా అందాల ఆరబోత కార్యక్రమం మొదలు పెట్టిందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈమధ్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఒక యంగ్ హీరోకి జంటగా నిహారికను తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అందుకే నిహారిక సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. గతంలో కూడా ఈ అమ్మడు కొంతమంది యంగ్ హీరోల సరసన నటించిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు కూడా నిహారిక ఒక మంచి పాత్రకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

అంతా ఓకే అయితే నిహారిక నటించబోయే కొత్త సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత నిహారిక నటించబోయే సినిమా కాబట్టి అభిమానులు ఎక్కువగా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో నిహారిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మరి ఇప్పుడైనా మంచి కథను ఎంచుకుంటే నిహారిక సక్సెస్ అయ్యి, కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.