చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2007 లో మొదట చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ చిన్న వయసులోనే చైల్డ్ యాక్టర్ గా ఒక సినిమాలో నటించారని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Photobundle: Ram Charan Teja rare childhood and family pictures

చిన్న తనంలోనే రామ్ చరణ్ చాలా క్యూట్ గా ముద్దుగా ఉండడంతో దర్శక నిర్మాతలు సైతం రామ్ చరణ్ చైల్డ్ యాక్టర్ గా పరిచయం చేయడానికి చాలామంది పోటీపడేవారుట.అయితే చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించారట. ఈ సినిమాలో రామ్ చరణ్ అంతగా నటించకపోవడంతో ఆ సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేసారని సమాచారం. చిన్న వయసులో రామ్ చరణ్ యాక్టింగ్ సరిగ్గా రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం.

దీంతో చిరంజీవి తన పెద్దయ్యాక సినిమాల్లోకి తీసుకు వస్తానని రామ్ చరణ్ కు చెప్పడంతో అనుకున్నట్టుగానే రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగుతరకు పరిచయం చేశారు. రామ్ చరణ్ ఉపాసనలకు 2012లో వివాహం అయింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసనలకు ఒక పండంటి బిడ్డ జన్మించింది. వీరికి వివాహమైన 12 సంవత్సరాలకు ఈ పాప జన్మించడంతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా చాలా సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.