చిరంజీవి పిలిచి అవ‌కాశం ఇచ్చినా నేను ఆయ‌న‌తో న‌టించ‌ను.. శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్‌!

న‌టుడు శివాజీ రాజా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయ‌న అనేక చిత్రాల్లో న‌టించారు. ప‌లు సీరియ‌ల్స్ కూడా చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి శివాజీ రాజా వీరాభిమాని అనే పేరుంది. కానీ, ఇప్పుడు త‌న అభిమాన హీరోపైనే శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

చిరంజీవి పిలిచి త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చినా నేను ఆయ‌న‌తో న‌టించ‌ను అంటూ శివాజీ రానా వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తున్న శివాజీ రాజా.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. త‌న కెరియర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి గురించి హాట్ కామెంట్స్ చేశాడు.

`చిరంజీవికి నేను అభిమాని అని అంద‌రికీ తెలుసు. ఆయ‌న‌ కుటుంబంతో కూడా చాలా క్లోజ్ ఉండేవాడిని. కానీ మన వాడే కదా అని ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదు. చిరంజీవితో గానీ, ఆయ‌న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల‌తో గానీ ఓ సినిమా కూడా చేయ‌లేదు. చిరంజీవి అభిమానిగా ఇన్ని ఏళ్లు ఉన్నందుకు కనీసం ఆయన సినిమాల్లో నటిస్తే నాకు తృప్తి ఉండేది. కానీ ఇకపై నాలో ఆ తపన లేదు.. నా మనసులో చిరంజీవితో నటించాలన్న కోరిక చచ్చిపోయింది..ఇక ఆయనే పిలిచి అవకాశం ఇచ్చినా కూడా నేను ఆయనతో నటించే ప్రసక్తే లేదు` అంటూ శివాజీ రాజా వ్యాఖ్యానించారు. దీంతో ఈయ‌న కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.