కాంతారా-2 చిత్రం కోసం అలాంటి సాహసం చేస్తున్న రిషబ్ శెట్టి..!

గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పటివరకు కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా ఎక్కువ చూసిన సినిమాగా పేరుపొందింది కాంతారా. దీంతో కన్నడ మీడియా సంస్థలో కాంతారా సినిమా గురించి పలు కథనాలు కూడా రాయడం జరిగింది.చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలో మొదటి విడుదలై ఆ తర్వాత ఎన్నో భాషలలో విడుదల కొన్ని వందల కోట్ల రూపాయలను రాబట్టింది.

Everyone Watched Kantara 2, Now Get Ready To Watch Kantara 1," Says Rishab  Shetty Adding That The Film Will Be Made On A Vast Scale!

కన్నడ తో పాటు అన్ని భాషలలో కాంతారా సినిమా విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది.ఆ సమయంలోనే కాంతారా సినిమాకు సీక్వెల్ రాబోతోంది అన్నట్లుగా డైరెక్టర్ హింట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా రిశాబ్శెట్టి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా కథ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంతారా సినిమా సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ గా కాంతారా-2 సినిమా రాబోతున్నది. కాంతారా లో చూపించిన కథకు ముందు జరిగిన కథను చూపించబోతున్నట్లు సమాచారం.

కాంతారా సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన కానీ కాంతారా-2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం డైరెక్టర్ నటుడు రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం కన్నడ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా సీక్వెల్ ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ఎవరు ఊహించని విధంగా కథను సిద్ధం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.