మద్యం తాగడం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..

ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ జంటగా సలార్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు మరికొన్ని భారీ చిత్రాల్లో నటించబోతుంది. శ్రుతి హాసన్ కెరీర్ ప్రారంభమైన కొత్తలో ఆమె నటించిన సినిమాలు అన్ని పరాజయం కావడంతో అందరూ ఆమెని ఐరన్ లెగ్ అన్నారు. ఆ తరువాత ఆమె టాలెంట్‌తో టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో శ్రుతి హాసన్ కి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత శృతిహాసన్ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ విజయం సాధించడంతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. శ్రుతి హాసన్ ఎవడు, బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి చాలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. దాంతో టాలీవుడ్ హీరోలకి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సమయంలోనే శ్రుతి ప్రేమ వ్యవహారాలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఈ అమ్ముడు విచిత్రమైన డ్రస్సులు వేసి ట్రెండీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ శాంతునూతో క్లోజ్ గా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఇంకో షాపింగ్ న్యూస్ ఏంటంటే చాలామంది హీరోయిన్ల లానే శ్రుతి హాసన్ కూడా మద్యం సేవిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. వారిలో ఒక అభిమాని శ్రుతి హాసన్ని మద్యం గురించి ప్రశ్నిస్తాడు. “మీరు మద్యం తాగుతారా?” అని అభిమాని అడిగిన ప్రశ్నకు ‘ నేను మద్యం ముట్టను, డ్రగ్స్ కూడా అలవాటు లేదు, జీవితాన్ని లగ్జరీగా గడపడం అంటే నాకు చాలా ఇష్టం.’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది శృతిహాసన్. శ్రుతి హాసన్ చెప్పిన మాటలు విని అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు.