మేఘా ఆకాష్ చేసుకోబోయే అబ్బాయిపై తల్లి షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ మేఘా ఆకాష్ మనందరికి సుపరిచితురాలే. నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనతో, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. లై సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తెలుగులో ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా, రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర లాంటి సినిమాలలో నటించింది. ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో నటించిన రావణాసుర సినిమా కూడా విజయం సాధించలేకపోయింది.

గత కొంతకాలంగా మేఘా ఆకాష్ కి పెళ్లి కాబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేఘా ఆకాష్ కన్యాకుమారికి చెందిన టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ గతంలో కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరో నెలరోజుల్లో వారిద్దరికి పెళ్లి జరుగుతుందని కోలీవుడ్ మీడియా రచ్చ రచ్చ చేసింది. కానీ చివరికి మేఘా ఆకాష్ పెళ్లి విషయంపై వచ్చిన వార్తలో నిజం లేదని తెలిసింది. ఇక ఇప్పుడేమో టాలీవుడ్ మీడియాలో మేఘా ఆకాష్ పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు కొడుకుని మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక నాలుగు ఐదు రోజుల నుంచి మేఘా ఆకాష్ పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నప్పటికీ ఆమె నుండి మాత్రం ఎటువంటి స్పందన రావట్లేదు. కానీ మేఘా ఆకాష్ పెళ్లి పై వస్తున్న వార్తల గురించి ఆమె తల్లి తాజాగా స్పందించింది. మేఘా ఆకాష్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని మేఘా ఆకాష్ తల్లి కన్ఫామ్ చేశారు. అలాంటి తప్పుడు వార్తలను ఇంకోసారి స్ప్రెడ్ చేయొద్దంటూ మేఘా ఆకాష్ తల్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ మేఘా ఆకాష్ నిజంగానే పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని మేమే స్వయంగా ప్రకటిస్తామని కూడా ఆమె తెలిపింది. మెగా ఆకాష్ తల్లి ఇచ్చిన సమాచారంతో మేగా పెళ్లి పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.