రాఖీ బాయ్ గ్యారేజ్‌లోకి మ‌రో ల‌గ్జ‌రీ ఖారు.. ధ‌ర ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన రాఖీ బాయ్ య‌శ్‌.. త‌న గ్యారేజ్ లోకి మ‌రో ల‌గ్జ‌రీ కారుకు వెల్క‌మ్ చెప్పాడు. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. అంతేకాదు త‌న కొత్త కారుతో భార్య రాధిక పండిట్‌, పిల్లలు యథర్వ్‌, ఐరాతో కలిసి ఫోటోల‌కు పోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇక‌పోతే రాఖీ బాయ్ కొత్త కారు ధ‌ర ఓంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది. ఎందుకంటే.. య‌శ్ కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ కారు ధర రూ. 4 కోట్లు. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాస‌వంతంగా ఈ కారు ఉంటుంద‌ట. ఈ కారు ఫీచ‌ర్స్ య‌శ్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ట‌. అందుకే లేట్ చేయ‌కుండా త‌న గ్యారేజ్ లోకి తెచ్చిపెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

య‌శ్ వ‌ద్ద ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో రేంజ్ రోవర్ కూడా వ‌చ్చింది. కాగా, కేజీఎఫ్ 2 త‌ర్వాత య‌శ్ నుంచి మ‌రొక ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. య‌శ్ త‌దుప‌రి సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.