పూనకాలు తెప్పించే విధంగా మహేష్- ఎన్టీఆర్ మల్కిస్టారర్ మూవీ..!!

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎంతోమంది నటీనటులతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు ఎన్టీఆర్.

I'm admiring Mahesh Babu and Jr NTR
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో యాంకర్ ప్రశ్నించగా మల్టీస్టారర్ సినిమాల గురించి ప్రస్తావించడం జరిగింది.. ఒకవేళ మల్టీ స్టార్ సినిమా కనుక చేయవలసి వస్తే ఎవరితో చేస్తారని ప్రశ్న ఎదురవగా.. ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెడుతూ తాను మల్టీ స్టార్ సినిమా చేయాల్సి వస్తే మహేష్ బాబుతో చేస్తానంటూ తెలియజేయడం జరిగింది. కచ్చితంగా ఏదో ఒక రోజు మహేష్ తో కలిసి నటించే అవకాశం వస్తుంది అని తెలియజేశారు ఎన్టీఆర్. గత ఏడాది రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి RRR లో నటించారు.

ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ఏదైనా రీమిక్స్ చేయాలి అంటే ఏ సినిమా చేస్తారని ప్రశ్నించగా.. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా దానవీరశూరకర్ణ సినిమా అని రీమేక్ చేస్తానని తెలిపారు. అలాగే తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించాను కానీ మహేష్ బాబుతో కలిసి కచ్చితంగా ఒక్క సినిమాలోనైనా మల్టీ స్టార్ గా నటించాలని కోరిక ఉందంటూ తెలియజేయడం జరిగింది. మరి అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ మల్టీ స్టార్లర్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా చేస్తారేమో చూడాలి మరి.