స‌మంత రూటులోనే లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే!?

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయ‌ణం నడిపిస్తున్న లావణ్య త్రిపాఠి.. మరి కొద్ది రోజుల్లో అతనితో పెళ్లి పీటలు ఎక్క‌బోతోంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం వైభవం గా జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుందని అంటున్నారు. ఇకపోతే వివాహం తర్వాత సినిమాల్లో నటించకూడదని లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ కండిషన్ పెట్టాడని.. ఆ కండిషన్ కు ఒప్పుకున్నాకే పెళ్ళికి రెడీ అయ్యారని రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే లావణ్య త్రిపాఠి కూడా వ‌రుణ్ కు కండీష‌న్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తనకిష్టమైన క్లాసికల్‌ డాన్సు ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్ప‌కూడ‌ద‌ని.. అలాగే సినిమా ప్రొడక్షన్‌లో తాను కొనసాగుతాన‌ని.. అందుకే అంగీక‌రిస్తేనే పెళ్లి చేసుకుందామ‌ని లావ‌ణ్య వ‌రుణ్ తో చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ వార్త‌ల‌న్నీ ఒట్టి పుకార్లే అని తెలుస్తోంది. పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, న‌య‌న‌తార వంటి హీరోయిన్లుగా సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇప్పుడు వీరి రూటులోనే లావ‌ణ్య త్రిపాఠి కూడా న‌డ‌వ‌బోతోంద‌ట‌. వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య‌కు ఎలాంటి కండీష‌న్ పెట్ట‌లేద‌ట‌. పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే తాజాగా లావ‌ణ్య మూడు కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది. అందులో ఓ త‌మిళ సినిమా, ఓ తెలుగు సినిమా కాగా.. మ‌రొక‌టి వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. అయితే ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య సినిమాలు చేయ‌డం మెగా ఫ్యాన్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. మెగా కోడ‌లు మ‌రొక హీరోతో రొమాన్స్ చేయ‌డం వారు అస్స‌లు జీర్ణించుకోలేరు. మ‌రి మెగా ఫ్యాన్స్ ను లావ‌ణ్య ఎలా కూల్ చేస్తుందో చూడాలి.