దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర అదేనా..?

అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. టాలీవుడ్ లోకి మాత్రం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయము కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా పలు చిత్రాలలో నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నది.

Janhvi Kapoor Set To Make Her South Film Debut In Telugu With Jr NTR |  Janhvi Kapoor South Debut: साउथ में डेब्यू के लिए तैयार हैं जाह्नवी कपूर,  जूनियर एनटीआर के साथ

టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషలో కూడా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో పరిచయం కాబోతోంది. దేవర సినిమా కోసం ఇప్పటికే ఎన్నోసార్లు హైదరాబాద్కు వచ్చి పలు రకాల షెడ్యూల్సులో పాల్గొనింది జాన్వీ కపూర్. దీంతో జాన్వీ కపూర్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ గా మారబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న దేవర సినిమాలో ఈ ముద్దుగుమ్మ మత్స్యకార కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించబోతుందని మొదట్లో వార్తలు వినిపించాయి.

Janhvi Kapoor shares first poster of her Telugu debut NTR 30 on birthday -  Hindustan Times

అయితే ఈ సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్గా చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విలన్ సైఫ్ అలీ ఖాన్ సవతి కూతురు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దేవర సినిమాలో ఈ ముద్దుగుమ్మ రోల్ చాలా కీలకంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేసే విధంగా జాన్వీ కపూర్ పాత్ర ఉండబోతొందనీ సమాచారం. ఎన్టీఆర్ విశాలన్నిటిని కూడా తన సవతి తండ్రికి తెలియజేస్తూ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఈమె పాత్ర హైలెట్ గా ఉండబోతుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.