పెళ్లి విష‌యంలో కృతిస‌న‌న్ ఇంత భ‌య‌ప‌డిందా…. !

సినీ ఇండస్ట్రీలో వాళ్లంటే ఎక్కడో ఒకచోట చిన్న చూపు ఉండనే ఉంటుంది.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని వారి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేము.. సక్సెస్ ఉన్నంతకాలం స్టార్డం మాత్రమే ఉంటుంది సినిమా అంటే గ్యారెంటీ లేని లైఫ్ అని సెక్యూరిటీ కూడా ఉండదని చాలామంది నటీనటుల సైతం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

KritiKeLiye: Fans have a special way of wishing Kriti Sanon 'Happy Women's  Day'

వీటన్నిటిని దాటుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లిన వారే సక్సెస్ అవుతూ ఉంటారని చెప్పవచ్చు.. హీరోయిన్ కృతి సనన్ సినిమాలలోకి వచ్చే ముందు చాలా భయపడినట్టుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తోంది. సినిమా హీరోయిన్లను ఎవరు వివాహం చేసుకోరని జీవితాంతం ఒంటరిగా గడపాలని కాలేజీ రోజుల్లో తమ స్నేహితులు చాలా భయపెట్టేవారట. సినీ ఇండస్ట్రీ లోకి వెళ్తే తనకి వివాహం కాదేమోనని చాలా భయపడిపోయానని తెలియజేసింది.. కానీ ఇంట్లో తల్లి ధైర్యంగా చెప్పడంతో ఆ వైపుగా అడుగులు వేశానని ప్రస్తుతం సక్సెస్ అయ్యానని తెలియజేస్తోంది కృతి సనన్..

Kriti Sanon's bridal look for 'Hum Do Humare Do' is so ethereal
కృతి సనన్ చిన్న వయసులోనే ఎలాంటి లక్ష్యం ఉండేది కాదట. కేవలం బీటెక్ చదువుతున్నప్పుడే మోడలింగ్ వైపుగా అడుగులు వేసి చదువుతోపాటు మోడలింగ్ కూడా ప్రారంభించిందత .ఇక అక్కడే పలు ప్రకటనలో నటించిన మొదలుపెట్టిందట ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కష్టాలను అధిగమించి తొలిసారిగా తెరమీద తనని తాను చూసుకున్నప్పుడు అన్ని మర్చిపోయానని తెలిపింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం ఈ పొజిషన్ లోకి వచ్చానని తెలుపుతోంది ఈ ముద్దు గుమ్మ.