పెళ్లి కాక‌పోయినా కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇలాయానా అలాంటి ప‌ని చేస్తుందా?

గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్ గా త‌న ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. త్వ‌ర‌లోనే తాను త‌ల్లి కాబోతున్నాన‌ని వెల్ల‌డించింది. ఇలియానాకు నెలలు కూడా దగ్గరపడ్డాయి.

సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మ‌డు.. త‌ర‌చూ బేబీ బంప్ ను ప్ర‌ద‌ర్శిస్తుంటుంది. ఇక‌పోతే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎంత ఆనందంగా ఉండే.. క‌డుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంటుంటారు. అందుకే గ‌ర్భిణీలు త‌మ భ‌ర్త‌తో టైమ్ స్పెండ్ చేస్తూ వెకేష‌న్స్ కు వెళ్తుంటారు. కానీ, ఇలియానాకు పెళ్లి కాలేదు. గ‌తంలో ఈమె ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతడితో విడిపోయింది.

అప్పటి నుండి ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సడన్ గా ఇలియానా త‌న ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. అయితే పెళ్లి కాక‌పోయినా క‌డుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇలియానా ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. అందుకే తనకు నచ్చిన ప్రదేశాల్లో ఒంట‌రిగానే విహ‌రిస్తోంది. తాజాగా కూడా సముద్ర తీరంలో సేద తీరుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇక మ‌రికొద్ది రోజుల్లోనే ఇలియానా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. కాగా, కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ కారణంగా ఇలియానా తల్లి అయ్యారనే టాక్ ఉంది. మ‌రి ఇంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.