ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తారు!

పైన మీకో ఫోటో క‌నిపిస్తుంది. ఆ ఫోటోలో కొప్పున పూలు పెట్టుకుని తేనె క‌ళ్ల‌తో ఆక‌ట్టుకుంటున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మీకు బాగా సుప‌రిచిమే. స్టార్ హీరోయిన్ కాక‌పోయినా.. వారి కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతం. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తుంటారు. గుర్తొచ్చిందా..? ఇంకా క్లూ కావాలి అంటే మాత్రం.. ఆమె ఒక స్టార్ యాంక‌ర్‌. టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న మ‌హారాణి.

మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ ఆమె చ‌క్క‌గా మాట్లాడుతుంది. అలాగే టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగినా, స‌క్సెస్ మీట్ జ‌రిగినా ఆమె ఉండాల్సిందే. ఈ పాటికే మీకు ఆమె ఎవ‌రో తెలిసిపోయుంటుంది. అవును.. ఈ చిన్నారి కోట్లాది ప్రేక్ష‌కుల ఫేవ‌రెట్ యాంక‌ర్ సుమ‌.

 

కేరళకు చెందిన సుమ‌.. కేరళ కుట్టి గెటప్‌లో చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా క‌నిపిస్తోంది. నిజానికి కల్యాణ ప్రాప్తిరస్తు అనే మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన సుమ‌కు.. వెండితెర‌పై ఎక్కువ‌గా స‌హాయక పాత్ర‌లే వ‌చ్చాయి. అలా స‌హాయ‌క పాత్ర‌లు చేస్తూనే.. మ‌రోవైపు ప‌లు సీరియ‌ల్స్ లో న‌టించింది. క్ర‌మంగా బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చి.. అలానే బ‌లంగా పాతుకుపోయింది. టాలీవుడ్ లో నెంబ‌ర్ 1 యాంక‌ర్ గా స్థానాన్ని సంపాదించుకుంది. రీసెంట్ గా సుమ `జయమ్మ పంచాయతీ` అంటూ మ‌రోసారి న‌ట‌న వైపు అడుగులు వేసినా.. పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.