అభిమాని చేసిన ప‌నికి అంద‌రి ముందు ఏడ్చేసిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి సినీ కెరీర్ ను కొన‌సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. స్టార్ హీరోల‌తో స‌మానంగా ఫ్యాన్ బేజ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన ప‌నికి అంద‌రి ముందు త‌మ‌న్నా ఏడ్చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో తమన్నా ఓ లేడీ అభిమానిని కలిసింది. ఆమెతో త‌మ‌న్నా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. అలాగే త‌మ‌న్నాను చూసిన వెంట‌నే స‌ద‌రు అభిమాని ఆమె కాళ్లు మొక్కింది. అలాగే ఫ్లెవ‌ర్ బొకేతో పాటు ఓ లెట‌ర్ ను త‌మ‌న్నాకు ఇచ్చింది. అంతేకాదు, త‌మ‌న్నాకు తన చేతి పై ఉన్న పచ్చబొట్టును చూపించాడు.

ఇంత‌కీ టాటూ ఏంటంటే.. త‌మ‌న్నా రూపంతో పాటు `ల‌వ్ యు ది త‌మ‌న్నా` అని రాసి ఉంది. ఇక ఆ టాటూ చూడ‌గానే త‌మ‌న్నాకు క‌న్నీళ్లు ఆగ‌లేదు. వెంట‌నే ఫుల్ ఎమోష‌న‌ల్ అయిపోయింది. అంద‌రూ చూస్తుండ‌గానే స‌ద‌రు అభిమానిని హ‌త్తుకుని ప‌లు మార్లు థ్యాంక్స్ చెబుతూ ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా, త‌మన్నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈ బ్యూటీ భోళా శంక‌ర్‌, త‌మిళంలో జైల‌ర్ చిత్రాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో ఈమె న‌టించిన బోల్డ్ వెబ్ సిరీస్ `జీ కర్దా` రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అలాగే మ‌రొక వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్ 2` రిలీజ్ కు రెడీ అయింది.

https://www.instagram.com/reel/Ct9u4Fcxw2G/?utm_source=ig_web_copy_link