ఎట్టకేలకు నా డ్రీమ్ నెరవేరబోతోంది – ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ఇలా పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో భాగం కావడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. అంతేకాదు చాలామంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లోకనాయకుడు కమలహాసన్ ప్రాజెక్టు కె సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Project K': Kamal Haasan on board Prabhas-Nag Ashwin's film - The Hindu

ఈ నేపథ్యంలోనే భూమి మొత్తాన్ని కవర్ చేసే ఒక నీడ కావాలి మాకు.. అది కమలహాసన్ అంటూ కమల్ పాత్రను తెలిపేలా ఒక చిన్న గ్లింప్ ను ప్రాజెక్ట్ కే నుంచి చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి. ప్రాజెక్టు కే సినిమాలో కమల్ హాసన్ నటిస్తుండడంపై ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర బృందం విడుదల చేసిన వీడియోని ఆయన షేర్ చేస్తూ.. నా హృదయంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం కమల్ హాసన్ సార్ తో కలిసి నటించడం అది నాకు గౌరవం కంటే ఎక్కువ.

ఆయన దగ్గర నటిస్తూ నేర్చుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టం.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు నా కల నెరవేరబోతోంది.. అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ప్రభాస్.. మొత్తానికైతే ప్రభాస్ పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది . మొత్తానికి 2024న జనవరి 12 న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.